నన్ను ఎదిగేలా చేయండి

నన్ను ఎదిగేలా చేయండి
 ఎక్కడ్రా బాబూ వెతికేది
ఎలా కనబడకుండా పోయింది
 ఏ గుల్మాల మధ్య
 వాల్మీకం లో దాగింది
 ఎన్ని అకృత్యాలకు
  ప్రకృతి విలయతాండవాలకు
  ఎన్ని విజయాలకు
  వినాశనాలకు
  అది
  సాక్షి
  నిత్య విహార పక్షి
           ఎలా కనబడకుండా పోయింది......
     నాకేనా ఇలా???
  నీడ శిబిరాల్లో
  నా వొళ్ళు నేనే కప్పుకొని
  బిగదీసుకుని..
 పారేసిన ఎంగిలి ఆకుల్ని
 కుక్కల్తో పాటు పోట్లాడి
 తెచ్చుకొని
 గుడి మెట్ల మీద చేతులు
 చాపుకుని
 అస్థిత్వాన్ని అరువు పెట్టి...
 వెతుకుతూనే ఉన్నాను
 కదుపుతూనే ఉన్నాను
 అది
 ఆగిపోయినట్లుంది
నా కాలం
కనబడకుండా పోయింది
మీకు గానీ కనబడితే
కాస్త చెప్పండి
మార్పు చూపే భవిష్యత్ వైపు
నన్ను తీసుకుపొమ్మని
ఈ అనాధ ని
మోసుకు పొమ్మని
గట్టి మట్టి పెళ్ళల కింద
నొక్కిపెట్టేసిన విత్తుని
కనీసం ఒకరైనా
కన్నీటి చుక్క రాల్చి
వదులు చేయండి
నా కాలాన్ని
  కదిలేలా...తిరిగేలా.. చేయండి
  నన్ను ఎదిగేలా చేయండి.

3 కామెంట్‌లు:

  1. నీడ శిబిరాల్లో
    నా వొళ్ళు నేనే కప్పుకొని.......చాలా మంచి భావ వ్యక్తీకరణ అన్నయ్య.

    అస్థిత్వాన్ని అరువు పెట్టి...
    వెతుకుతూనే ఉన్నాను
    కదుపుతూనే ఉన్నాను.
    ఈ పదాలలో భావం నాకు నచ్చింది
    keep going my dear brother.. all the best

    రిప్లయితొలగించండి
  2. It is the poetry that ever has touched my heart with its pictorial dimensions.please continue writing poetry for me like people.
    kiran

    రిప్లయితొలగించండి
  3. mama u can create wonders!
    sensations!
    with ur heart touching poetry!

    KIRAN FROM ABHYUDAYA KIRANAM

    రిప్లయితొలగించండి