శ్రీకూలు

భూమికి జ్వరం
వచ్చినట్లుంది
గ్రీన్ కాప్స్యూల్స్
 వెయ్యండి



 
చిత్రంగా ఉంది
ఇందరి కన్నీరు ఆవిరైనా
వాన పడటం లేదా??


 




తుపాకీకి గురి తెలుసు
పట్టిన చేతులకే
తెలియట్లేదు.




ముక్క కలవకపోతె కాసులే పోయేను
బద్దకించే వాని టైము పోయె
మనసు కలవక పోతె జీవితం పోయెరా
పచ్చి నిజముల మాట శ్రీకు నోట

3 కామెంట్‌లు:

  1. శ్రీకాంత్ గారూ,
    "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. నా బ్లాగును క్రమం తప్పకుండా చూస్తున్నందుకు ధన్యవాదలు.
    ఆ మధ్య ఫీడ్ జిట్ లో నా బ్లాగు ట్రాఫిక్ చెక్ చేస్తుంటే ఎవరో "సమీరం" బ్లాగులోని లింక్ ద్వారా నా బ్లాగులోకి ప్రవేశించినట్లు గమనించి వెంటనే మీ బ్లాగు చూసాను. మీకు నచ్చిన బ్లాగుల లిస్ట్ లో నా బ్లాగును చేర్చడం నాకు ఆనందాన్ని కలిగించింది.
    మీ బ్లాగును స్థాలీపులాక న్యాయంగా చూసాను. మీ "శ్రీకూ"లు బాగున్నాయి. అందులో క్రింది శ్రీకూ కొద్దైగా ఆటవెలది లక్షణాలున్నాయని గుర్తించి దానిని ఆటవెలదిగా మార్చి మీ బ్లాగులో వ్యాఖ్యగా పెట్టాలని చూస్తే "ఎర్రర్" మెసేజ్ వచ్చింది.
    ముక్క కలవకపోతె కాసులే పోయేను
    బద్దకించే వాని టైము పోయె
    మనసు కలవక పోతె జీవితం పోయెరా
    పచ్చి నిజముల మాట శ్రీకు నోట
    దీనికి నా పద్యానుకృతి ..............
    ముక్క కలువకున్న పోవును కాసులే
    బద్ధకించువాని ప్రొద్దు పోవు
    మనసు కలువకున్న మనుగడయే పోవు
    పచ్చి నిజము లెపుడు పలుకు శ్రీకు.

    రిప్లయితొలగించండి
  2. మీకు,మీ అనుకృతి కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను మంచి పాఠకుడ్ని,భాషాజ్ఞానం ఉన్నా కానీ ఛందో పరిజ్ఞానం శూన్యం.కానీ, మీ బ్లాగులో సమస్యలని పూరణచేసే తీరతాను లెండి.(త్వరలో, ఆ ప్రయత్నంలోనే ఉన్నా)

    రిప్లయితొలగించండి
  3. మామా... నీ బ్లాగు చాలా బాగుంది... నిజంగా నేను బాగా inspair అయ్యాను

    రిప్లయితొలగించండి