శ్రీధర్ పేజి

{మా అన్నయ్య, నా స్ఫూర్తి శ్రీధర్ పేజీ ఇది}
హృదయం
వృద్ధాప్యపు త్రవ్వకాల్లో
బయల్పడ్డ యౌవనపు అనుభవాల శిధిలాలు
పదిలంగా భద్రపరచబడ్డ
మ్యూజియం ఈ హృదయం


 జగాన ఖ్యాతినొందనీ
విశ్వవీణ జీవతంత్రి పై
భరతభూమి భవిత మీటితే
అనాది ప్రేమ రాగమాలపించనీ
సుఖాలు రాజ్యమేలనీ
జగాన ఖ్యాతినొందనీ


నాలో నేను
నా యేద గోతుల్లో లోతులు కొల్చుకుంటే మంచులా కరిగిపోతా
చాలని కోర్కెలు చాలిస్తే నన్ను పాలించేదెవరు?
నా బ్రతుక్కి అతుకుల్లా ఫేయిల్యూర్ల పర్వం
నా చదువుల సర్వం..ఇదేగా నా గర్వం
నేతిబీరకాయలో నెయ్యుందని ఆవునమ్మిన అశావాదిని
నువ్వేదన్నా వాదిస్తా..లేదంటే వేదిస్తా
చేతల్లో చేదు నిజాలు మాటల్లో మళ్ళిస్తా.
నా అదృష్టం ఎలా అడుక్కుందిరా బాబూ..నేనిలా పడుక్కున్నా
ఆవేశం అరక్షణం.. ఆక్రందన ప్రతిక్షణం
ఈ మధ్యే వళ్ళు ముదిరి బరితెగించి
నా పరువుకాస్తా తీద్దామని వెకిలివేషం సకిలించింది
రాంగ్ రూట్..స్ట్రాంగ్ డోస్
హమ్మయ్య రెండు పదుల రెండు మేధస్సు ముదిరిందని
నాకిప్పుడే తెలిసొచ్చింది


అలకల కులుకుల అలరుల రమణీ

వన్నెల వెన్నెల కన్నులలోని
రివ్వున రువ్విన నవ్వులలోని
ఆరని కురుల అలజడి లోని
ముక్కున ముక్కెర మురిపిస్తుంటే
నొక్కుల చెక్కిలి ఎక్కిళ్ళాయె
బంధము నీలోడెందమునొందే
అందని అందము ముందర నీవే
ఎందున చూసిన అందున నీవే
చొప్పున రావే చక్కని చుక్కా
అలకల కులుకుల అలరుల రమణీ
ఆమని అలకలు తీర్చగ రావే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి